
Modi: జపాన్‌లో మోదీ చిత్రం.. పిక్చర్ ఆఫ్ ది డే..!
ప్రపంచానికి దారి చూపుతున్నారంటూ భాజపా నేతల స్పందన
టోక్యో: క్వాడ్ సమావేశం నిమిత్తం జపాన్ వెళ్లిన ప్రధాని మోదీ.. తీరిక లేకుండా చర్చలు జరుపుతున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని మెరుగుపర్చుకునేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా పాలకులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన చిత్రం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆ చిత్రంలో క్వాడ్ దేశాల నేతలంతా ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటూ మెట్లు దిగుతూ ఉన్నారు. వారందరిలో మోదీ అందరికంటే ముందుగా నడుస్తుండగా.. ఆయన పక్కన జపాన్ ప్రధాని ఉన్నారు. వారి వెనుక అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా నూతన ప్రధాని మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ మొత్తం చిత్రాన్ని గమనిస్తే.. ప్రధానినే వారికి మార్గనిర్దేశం చేస్తున్నట్లు కనిపిస్తోందని భాజపా నేతలు వరుస ట్వీట్లు పెడుతున్నారు. ‘ప్రపంచానికి దారి చూపిస్తున్నారు.. ఒక చిత్రం ఎన్నో భావాల సమాహారం’ అంటూ భాజపా నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ‘విశ్వ గురువు భారత్’ అని సంబిత్ పాత్రా అనగా.. ‘ఈ ప్రధాన సేవకుడికి దారి తెలుసు.. ఆ దారిని ఇతరులకు చూపిస్తారు’ అంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. ఇంకొందరు ‘ప్రపంచ నేత’ అని కొనియాడారు. pictureoftheday అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ చిత్రంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eknath Shindhe: నాడు ఆటో నడిపాడు.. నేడు మహారాష్ట్రను నడిపించనున్నాడు!
-
World News
Pak Economic Crisis: దాయాది దేశం.. మరో శ్రీలంక కానుందా..?
-
Business News
Vedantu: ఇక ఆఫ్లైన్లోనూ పాఠాలు.. తొలి కేంద్రాన్ని ప్రారంభించిన ‘వేదాంతు’
-
Politics News
Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్ ప్రమాణ స్వీకారం
-
Politics News
Telangana News: తెలంగాణలో భాజపాకు బిగ్ షాక్... తెరాసలో చేరిన కార్పొరేటర్లు
-
Sports News
Ind vs Eng: టీమ్ఇండియా కెప్టెన్‌గా బుమ్రా... తుదిజట్టు ప్రకటించిన ఇంగ్లాండ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- IND vs ENG: కథ మారింది..!
- Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?