Published : 11 Aug 2022 14:02 IST

Modi - Raksha Bandhan: పీఎంవో సిబ్బంది కుమార్తెలతో మోదీ రక్షా బంధన్‌.. చూస్తారా!

దిల్లీ: రాఖీ పర్వదినాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రత్యేకంగా జరుపుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కుమార్తెలతో కలసి ఆయన పండగ జరుపుకున్నారు. పీఎంవో ఆఫీసు అధికారులతో పాటు స్వీపర్లు, ప్యూన్లు, గార్డెన్‌ సిబ్బంది, డ్రైవర్లు, ఇతర ఉద్యోగుల కుమార్తెలతో రాఖీ (Raksha Bandhan) కట్టించుకున్నారు. ఆ తర్వాత వారితో కాసేపు సరదాగా ముచ్చటించి, చిన్నారులను ఆశీర్వదించారు.

రాఖీ పండగ ఫొటోలను ప్రధాని ట్విటర్‌లో పంచుకుంటూ ‘‘ఈ చిన్నారులతో నా ప్రత్యేక రక్షా బంధన్‌’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు, ఆయన ట్విటర్‌ వేదికగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానికి చిన్నారులు రాఖీ కడుతున్న వీడియోను భాజపా అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘‘ఈ దేశాన్ని రక్షిస్తారన్న నమ్మకంతో కడుతున్న రాఖీ ఇది’’ అంటూ రాసుకొచ్చింది.



Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని