Startups: దేశం కోసం.. దేశం నుంచి.. ఆవిష్కరణలు చేద్దాం : ప్రధాని మోదీ

జనవరి 16ను జాతీయ అంకుర దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అంకుర సంస్థలు నవ భారతానికి

Updated : 15 Jan 2022 13:35 IST

దిల్లీ : జనవరి 16ను జాతీయ అంకుర దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అంకుర సంస్థలు నవ భారతానికి వెన్నెముకగా మారనున్నాయని అన్నారు. 150కిపైగా స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రసంగించారు.

‘భారత దేశం కోసం ఆవిష్కరణలు చేద్దాం.. భారత దేశం నుంచి ఆవిష్కరణలు చేద్దాం. దేశంలోని ప్రతి జిల్లాలోనూ అంకుర సంస్థలు రావాలి. కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్న యువతకు అభినందనలు. విశ్వయవనికపై భారత అంకుర పతాకం ఎగురవేయాలి. 2013-14లో 4 వేల పేటెంట్లు ఉండగా.. గతేడాది 28 వేలకు చేరాయి. యువత ఆలోచనలు విశ్వవ్యాప్తంగా ప్రభావితం చేసేలా ఉండాలి’ అని ప్రధాని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని