Modi: మోదీనే మోస్ట్ పాపులర్.. బైడెన్, రిషి సునాక్ ఏ స్థానాల్లో ఉన్నారంటే..?
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన దేశాధినేతగా ప్రధాని మోదీ (Modi) నంబర్ వన్ స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు దక్కిన ప్రజామోదం కంటే మోదీ దాదాపు రెట్టింపు ప్రజాదరణ పొందడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులారిటీ ఉన్న దేశాధినేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి అగ్ర స్థానంలో నిలిచారు. 78 శాతం ప్రజామోదంతో ప్రపంచ నాయకులు అందరికంటే అత్యధిక జనాదరణ ఉన్న నేతగా తొలి స్థానంలో నిలిచారు. ఈ మేరకు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) అనే సర్వే సంస్థ వెల్లడించింది. గత సర్వేలో ఆరో స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)తాజా సర్వేలో ఏడో స్థానానికి పడిపోయారు.
ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల అధినేతలపై మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో మోదీ (Modi) నాయకత్వాన్ని 78శాతం మంది ఆమోదించగా.. 18 శాతం వ్యతిరేకించారు. ఈ జాబితాలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 68 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. అమెరికా (America) అధ్యక్షుడు బైడెన్ 40 శాతం ప్రజామోదంతో ఏడో స్థానంలో ఉన్నారు. ఇటలీ తొలి మహిళా ప్రధానిగా ఘనత సాధించిన జార్జియా మిలానీ 52శాతం ప్రజామోదంతో 6 స్థానంలో నిలిచారు. గతేడాది చివర్లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ (Rishi Sunak) 30శాతంతో ఈ జాబితాలో 13వ స్థానం దక్కించుకున్నారు.
ప్రధాని మోదీ (Modi) నాయకత్వంలోని భారత విదేశాంగ విధాన చరిత్రలో 2022లో గుర్తుంచుకోదగ్గ ఏడాదిగా నిలిచిందని ఈ సర్వే వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్ర నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఎవరివైపు నిలబడాలనేది తర్కించుకుంటున్నాయి. దీంతో పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న సమయంలో మోదీ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. ‘ఇది యుద్ధాల శకం’ కాదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆయన చేసిన సూచనను యావత్ ప్రపంచం ఆమోదించి ప్రశంసలు కురిపించిందని సర్వే వెల్లడించింది.
కాగా.. మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) గత సర్వేల్లోనూ ప్రజామోదంలో మోదీ నంబర్ వన్ స్థానంలోనే ఉన్నారు. జనవరి 26 - 31 మధ్య వారం పాటు ప్రతి దేశంలోనూ వయోజనుల నుంచి అభిప్రాయాలు సేకరించి మార్నింగ్ కన్సల్ట్ ఈ రేటింగ్స్‌ను విడుదల చేసింది.
ప్రజామోదంలో టాప్ లీడర్లు వీరే..
* నరేంద్ర మోదీ, భారత ప్రధాని (78 శాతం)
* లోపెజ్ ఒబ్రేడర్, మెక్సికో అధ్యక్షుడు (68 శాతం)
* అలైన్ బెర్సెట్, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు (62 శాతం)
* ఆంథోనీ ఆల్బనీస్, ఆస్ట్రేలియా ప్రధాని (58 శాతం)
* లూయిజ్ ఇనాసియో లులా డసిల్వా, బ్రెజిల్ అధ్యక్షుడు (50 శాతం)
* జార్జియా మిలానీ, ఇటలీ ప్రధాని (52 శాతం) (ప్రజామోదం అధికంగా ఉన్నప్పటికీ.. బ్రెజిల్ అధ్యక్షుడి కంటే ఈమెకు వ్యతిరేకత ఎక్కువగా ఉండటం వల్ల ఆరో స్థానంలో నిలిచారు)
* జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు (40 శాతం)
* లియో వరాడ్కర్, ఐర్లాండ్ ప్రధాని (37 శాతం)
* జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాని (40 శాతం, అయితే వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉంది)
* అలెగ్జాండర్ డి క్రూ, బెల్జియం ప్రధాని (34 శాతం)
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
TikTok: టిక్‌టాక్ బ్యాన్‌తో నాకూ లాభమే: జస్టిన్ ట్రూడో
-
Politics News
సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ను శిక్షించాలి: ఏక్నాథ్ శిందే
-
Movies News
celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేత ‘తెలుగు వారియర్స్’
-
Movies News
Avatar 2 OTT Release Date: ఓటీటీలో అవతార్ 2.. ప్రీబుకింగ్ ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే!
-
Politics News
YSRCP: అన్నీ ఒట్టి మాటలేనా?.. వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ
-
Sports News
Ashwin: మాది బలమైన జట్టు..విమర్శలపై ఘాటుగా స్పందించిన అశ్విన్