Modi: ఆ విషయంలో ఆస్ట్రేలియా పీఎం హామీ ఇచ్చారు: మోదీ

శుక్రవారం భారత్‌, ఆస్ట్రేలియా ప్రధానులు పలు అంశాల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆ దేశంలోని ప్రవాస భారతీయుల భద్రత గురించి ఆసీస్‌ పీఎం(Anthony Albanese) వద్ద మోదీ ప్రస్తావించారు. 

Published : 10 Mar 2023 16:30 IST

దిల్లీ: ఆస్ట్రేలియా(Australia)లో భారతీయ సమాజం భద్రతపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌(Anthony Albanese) హామీ ఇచ్చారని ప్రధాని మోదీ(Modi) అన్నారు. ఈ మధ్యకాలంలో అక్కడ జరిగిన మతపరమైన దాడులను ఉద్దేశించి ఈ విధంగా స్పందించారు. 

‘ఆస్ట్రేలియా(Australia)లో మతపరమైన దాడుల గురించి వచ్చిన నివేదికలు చూశాను. వాటి గురించి ఆల్బనీస్‌కు వివరించాను. ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయ సమాజం భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని ఆయన నాకు మాటిచ్చారు’ అని మోదీ వెల్లడించారు. అలాగే ఇరు దేశాలకు చెందిన అంశాలపై చర్చించిన మోదీ, ఆల్మనీస్.. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘భారత్‌, ఆస్ట్రేలియా.. క్వాడ్‌లో సభ్యులు. ఈ ఏడాది మేలో జరగనున్న సమావేశం కోసం ఆస్ట్రేలియా పీఎం నన్ను ఆహ్వానించారు. సెప్టెంబర్‌లో జరిగే జీ20(G20) సమావేశానికి హాజరు కావాలని ఆయనకు వెల్లడించాను’ అని ప్రధాని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగం, ఖనిజ తవ్వకాలు వంటి అంశాల్లో సంబంధాలను మెరుగుపరచుకోవడం లక్ష్యంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చైనా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో పరిస్థితులపైనా ఇరువురు నేతలు సమీక్ష జరిపారు.

గురువారం ఈ ఇద్దరు నేతలు బోర్డర్‌ - గావస్కర్‌ (Border-Gavaskar series) సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్‌ను వీక్షించారు. 75 ఏళ్ల ఇండో-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా మోదీ (Narendra Modi), ఆల్బనీస్‌ (Anthony Albanese) స్టేడియానికి వచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని