Modi: కుర్చీ వద్దని నేలపై కూర్చున్న మోదీ.. వీడియో చూశారా!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పర్యటించిన సమయంలో కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ నిర్మాణంలో భాగస్వామ్యులైన కార్మికులతో కలగలసిపోయారు.

Published : 17 Dec 2021 19:03 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించిన సమయంలో కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ నిర్మాణంలో భాగస్వామ్యులైన కార్మికులతో కలగలసిపోయారు. కార్మికులపై పూల రేకులు చల్లడమే గాక, సాధారణ పౌరుడిలా వారి మధ్య కూర్చొని భోజనం చేశారు. ఆ సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని కోసం అధికారులు కుర్చీ వేసినప్పటికీ ఆయన మాత్రం కార్మికులతో కలిసి నేలపై కూర్చోవడం విశేషం.

కాశీ విశ్వనాథుని నడవా ప్రారంభించేందుకు గత సోమవారం మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసి వెళ్లిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కార్మికులను సత్కరించే కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోదీ కూర్చునేందుకు నిర్వాహకులు వేదిక వద్ద ఓ కుర్చీని ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని మాత్రం రాగానే ఆ కుర్చీని భద్రతా సిబ్బందికి ఇచ్చేశారు. కార్మికుల మధ్యకు వెళ్లి రెడ్‌ కార్పెట్ వేసిన మెట్లపై కూర్చున్నారు. అంతేనా.. తనకు దగ్గరగా వచ్చి కూర్చోవాలంటూ వారిని ఆహ్వానించారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. ‘లక్షలాది మాటల కంటే విలువైనది’ అంటూ మోదీ నిరాడంబరతను కొనియాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని