ఆక్సిజన్‌ లభ్యతపై మోదీ కీలక సమీక్ష 

కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో దేశంలో మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. వైద్య, ఉక్కు, రవాణా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పలు కీలక సూచనలు చేశారు. కేంద్రమంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించడం ఎంతో ముఖ్యమన్నారు.

Published : 16 Apr 2021 17:29 IST

ఆక్సిజన్‌ ట్యాంకర్లు 24 గంటలు తిరగాల్సిందే 

దిల్లీ: కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో దేశంలో మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. వైద్య, ఉక్కు, రవాణా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పలు కీలక సూచనలు చేశారు. కేంద్రమంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించడం ఎంతో ముఖ్యమన్నారు. కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉన్న 12 రాష్ట్రాలైన- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, యూపీ, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌లో ఆక్సిజన్‌ సరఫరాపై ఆరా తీసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. అలాగే, వచ్చే 15 రోజుల వరకు ఆక్సిజన్‌ లభ్యత, వినియోగం గురించి సమీక్షించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న 12 రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను అధికారులు ప్రధాని ముందుంచారు.  

దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు ఆక్సిజన్‌ ట్యాంకర్లు తిరిగేందుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి గురించి అధికారులు వివరించగా.. ప్రతి ప్లాంట్‌ సామర్థ్యం ప్రకారం ఉత్పత్తిని పెంచాలని మోదీ సూచించారు. సిలిండర్‌ ఫిల్లింగ్‌ ప్లాంట్‌లు అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ 24 గంటలు పనిచేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన ఆదేశించారు. డ్రైవర్లు షిఫ్టుల విధానంలో ఆక్సిజన్‌ సరఫరా చేయాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని