Pariksha Pe Charcha: ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను: ప్రధాని మోదీ

ఏప్రిల్ ఒకటిన జరగనున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి వస్తోన్న స్పందన అసాధారణమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దీనికోసం ఇప్పటికే లక్షల్లో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారన్నారు. 

Updated : 30 Mar 2022 16:52 IST

దిల్లీ: ఏప్రిల్ ఒకటిన జరగనున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి వస్తోన్న స్పందన అసాధారణమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దీనికోసం ఇప్పటికే లక్షల్లో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారన్నారు. ‘ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమం పట్ల చూపుతోన్న ఉత్సాహం అసాధారణంగా ఉంది. లక్షల్లో ప్రజలు తమ విలువైన అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు. ఇందుకోసం ముందుకొచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. ఏప్రిల్‌ ఒకటిన జరగబోయే కార్యక్రమం కోసం వేచిచూస్తున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి దిల్లీలోని తల్కటోరా స్టేడియం వేదిక కానుంది. గత నాలుగేళ్లుగా విద్యా శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా గతేడాది దీనిని వర్చువల్‌గానే నిర్వహించారు.

ఇదివరకే ఈ కార్యక్రమం గురించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ‘పరీక్షల నేపథ్యంలో ఒత్తిడి, భయం వంటి సమస్యల్ని అధిగమించేందుకు ప్రధాని నుంచి సలహాలు కోరండి. చిట్కాలు తెలుసుకోండి. ఎగ్జామ్‌ వారియర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సిద్ధంగా ఉండండి’ అంటూ ఆయన ట్విటర్‌లో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని