Published : 27 Jun 2022 18:48 IST

Modi: జర్మనీలో అపూర్వ స్వాగతం.. ముగ్ధుడైన ప్రధాని..!

వీడియో షేర్ చేసిన మోదీ

బెర్లిన్‌: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీకి వెళ్లిన ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. మ్యూనిక్‌ విమానాశ్రయంలో బవేరియా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ఘనంగా ఆహ్వానించింది. ప్రత్యేక బవేరియన్ బ్యాండ్‌తో సాదర ఆహ్వానం పలికింది. ఆ రాష్ట్రం, ప్రవాస భారతీయులు చూపిన అభిమానానికి ముగ్ధుడైన ప్రధాని.. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. 

‘ఈ రోజు నేను జీ7 సదస్సుకు హాజరు కానున్నాను. ఈ సమావేశంలో పలు అంతర్జాతీయ అంశాలను చర్చించనున్నాం. దానిలో భాగంగా నిన్న జర్మనీ చేరుకున్న తర్వాత జరిగిన విశేషాలు, లభించిన ప్రత్యేక స్వాగతం గురించి మీతో పంచుకుంటున్నాను’ అంటూ మోదీ తాజాగా ఒక వీడియోను పోస్టు చేశారు. 

మొదట మ్యూనిక్ చేరుకున్న ఆయనకు బవేరియన్ బ్యాండ్ ఘన స్వాగతం పలికింది. ఆ తర్వాత ఆయన ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఆడి డోమ్ స్టేడియంలో జరిగిన ఆ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో భారత ప్రవాసులు హాజరయ్యారు. మహమ్మారి తర్వాత మోదీ రాకతో ఒక్క దగ్గర చేరిన వారంతా.. తమ ప్రదర్శనలతో భారత సంస్కృతిని చాటి చెప్పారు. జాతీయ గేయం వందేమాతరం ఆలాపనతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. విదేశాల్లో భారతీయులకు లభిస్తోన్న గౌరవానికి కారణం మోదీనే అంటూ అక్కడివారు కొందరు ప్రధానిపై తమ అభిమానాన్ని వెలిబుచ్చారు. 

ఇదిలా ఉంటే.. జీ7 కూటమిలో అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే భారత్‌తోపాటు అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా నేతలను ప్రత్యేకంగా షోల్జ్‌ ఆహ్వానించారు. జీ7 దేశాలతోపాటు ఆహ్వానిత దేశాల నేతలతోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని