Ashok Gehlot: ‘అందుకే మోదీకి అంత గౌరవం ఇస్తారు’: రాజస్థాన్ సీఎం వ్యాఖ్య
మాన్‌గడ్ ధామ్ గుజరాత్, రాజస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో ఉంది. బ్రిటిష్ హాయంలో ఊచకోతకు గురైన 15 వందలమంది గిరిజనులకు గుర్తుగా దానిని నిర్మించారు. మంగళవారం ఇక్కడి గిరిజన ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.
జైపుర్: 1913లో బ్రిటిషర్ల చేతిలో ఊచకోతకు గురైన రాజస్థాన్ గిరిజనులకు మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాంస్‌వాఢా జిల్లాలోని మాన్‌గడ్ ధామ్ వద్ద భిల్ ఆదివాసీలు, ఇతర తెగల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వేదికపై రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేంద్ర పటేల్ ప్రధానితో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, గహ్లోత్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
‘మహాత్మా గాంధీ నడయాడిన దేశానికి, ప్రజాస్వామ్య మూలాలు బలంగా ఉన్న దేశానికి ప్రధాని కావడంతో మోదీజీ ఏ దేశం వెళ్లినా అమితమైన గౌరవం పొందుతున్నారు. ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది. ప్రజలు ఈ విషయం తెలుసుకొని గౌరవిస్తారు’ అని గహ్లోత్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గహ్లోత్, తాను సీఎంగా ఉన్న రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ‘ముఖ్యమంత్రులుగా గహ్లోత్‌జీ, నేను కలిసి పనిచేశాం. ఆయనకు ఎంతో పాలనా అనుభవం ఉంది. ఇక్కడ వేదికపై కూర్చొన్న ముఖ్యమంత్రుల్లో ఆయనే అత్యంత సీనియర్’ అని అన్నారు.
మాన్‌గడ్ ధామ్ గుజరాత్, రాజస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో ఉంది. బ్రిటిష్ హాయంలో ఊచకోతకు గురైన 15 వందలమంది గిరిజనులకు గుర్తుగా దానిని నిర్మించారు. ఇప్పుడు దానిని జాతీయ స్మారకంగా ప్రకటించారు. స్వాతంత్య్రం తర్వాత రాసిన చరిత్రలో ఈ గిరిజన ప్రజలు చేసిన త్యాగానికి, పోరాటానికి తగిన ప్రాధాన్యం దక్కలేదని ప్రధాని అన్నారు. ఈ రోజు తాము ఆ తప్పును సరిచేస్తున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి
-
Mayawati: బీఎస్పీ ఎంపీపై భాజపా ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు... మాయావతి రియాక్షన్ ఇదే!
-
Sidharth Luthra: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్
-
Nene Naa Movie ott: ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Social Look: శ్రద్ధాదాస్ ‘లేజర్ ఫోకస్’.. బెంగళూరులో నభా.. రకుల్ ‘ఫెస్టివ్ మూడ్’!