Modi: బడ్జెట్ సమావేశాలకు ముందే.. ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు..!
బడ్జెట్ సమావేశాల కోసం ప్రధాని మోదీ(Modi) పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముందు ప్రధాని నరేంద్రమోదీ(Modi) మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలు ప్రారంభానికి ముందే విశ్వసనీయ వర్గాల నుంచి సానుకూల సందేశాలు అందాయని ప్రధాని అన్నారు.
‘ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం నుంచే ఆర్థిక ప్రపంచంలోని విశ్వసనీయ వర్గాల నుంచి సానుకూల సందేశాలు వెలువడ్డాయి. కొత్త ఉత్సాహానికి నాంది పలికాయి. ఆర్థిక అనిశ్చితుల వేళ ప్రపంచం మొత్తం భారత్ బడ్జెట్ వైపు చూస్తోంది. ఈ రోజు మొదటిసారి రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ తొలి ప్రసంగం రాజ్యాంగానికి ప్రత్యేకించి మహిళలకు గర్వకారణం. సభ సజావుగా జరిగేందుకు సభ్యులంతా సహకరించాలి. విపక్షాలు తమ అభిప్రాయాల్ని సభలో వ్యక్తపరచాలి. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నా. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్‌ను ముందుకు తీసుకువెళతాం’ అని పార్లమెంట్‌కు చేరుకున్న అనంతరం మోదీ వెల్లడించారు.
గత ఏడాది జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రౌపదీముర్ము లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగం పూర్తికాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Apple Devices: ఐఓఎస్ యూజర్లకు కేంద్రం సూచన.. అప్డేట్ విడుదల చేసిన యాపిల్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
FootBall in Asian Games: ఇలాగైతే మమ్మల్ని ఎక్కడికీ పంపొద్దు: భారత ఫుట్‌బాల్ కోచ్ ఆవేదన
-
KTR: వరి మాత్రమే సరిపోదు.. ఆయిల్‌పామ్ పండించాలి: కేటీఆర్
-
Amazon Festival Sale: అమెజాన్ పండగ సేల్‌లో TVలపై ఆఫర్లివే..
-
Afghan embassy in India: భారత్‌లో అఫ్గాన్ ఎంబసీని మూసేస్తున్నారా? కేంద్రానికి మెసేజ్..!