ముకుల్‌ రాయ్‌కి మోదీ ఫోన్‌! 

భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన సతీమణి ఆరోగ్య పరిస్థితిని .......

Published : 03 Jun 2021 15:11 IST

కోల్‌కతా: భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన సతీమణి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని ఈ రోజు ఉదయం 10.30గంటల సమయంలో తన తండ్రికి ఫోన్‌ చేశారని ముకుల్‌ రాయ్‌ తనయుడు సుభ్రాంగ్షు వెల్లడించారు. తన తల్లి ఆరోగ్యం గురించి ప్రధాని వాకబు చేశారన్నారు. 

మరోవైపు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లి ముకుల్‌రాయ్‌ సతీమణిని పరామర్శించి వెళ్లిన కొద్ది గంటల తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కూడా ఆస్పత్రికి వెళ్లారు. మరోవైపు, ముకుల్‌ రాయ్‌ కూడా కరోనా బారినపడి ఇంట్లోనే కోలుకుంటున్నారు. అభిషేక్‌ బెనర్జీ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంలో అక్కడ సుభ్రాంగ్షు ఉన్నారు. ముకుల్‌ రాయ్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌లోకి మళ్లీ వెళ్తారంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ఊహాగానాల నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ యువజన విభాగం అధ్యక్షుడు అభిషేక్‌ బెనర్జీ పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని