Union Budget 2022: దేశాభివృద్ధికి ఇదే కీలక సమయం.. విపక్షాలు సహకరించాలి..!

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. ఇది దేశాభివృద్ధికి కీలక

Updated : 31 Jan 2022 13:09 IST

బడ్జెట్‌ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ పిలుపు

దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. ఇది దేశాభివృద్ధికి కీలక సమయమని అన్నారు. సమావేశాలకు ప్రతిపక్ష నేతలు సహకరించాలని కోరారు.   

‘‘బడ్జెట్‌ సమావేశాలకు ఎంపీలందరికీ స్వాగతం. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో   భారత్‌కు చాలా అవకాశాలున్నాయి. దేశాభివృద్ధికి ఇదే కీలక సమయం. దేశ ఆర్థిక పురోగతి, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం తదితర అంశాల్లో ప్రపంచానికి భారత్‌పై మరింత విశ్వాసం పెంపొందించేలా ఈ సమావేశాలు వేదిక కావాలి. ఇందుకు చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. బడ్జెట్‌ సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కోరుతున్నా. ఎన్నికలు ఎప్పుడూ జరుగుతుంటాయి. కానీ బడ్జెట్‌ సమావేశాలు చాలా కీలకం. చర్చల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సమావేశాలను ఫలప్రదం చేయాలి. దేశాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే ఆర్థిక పురోగతిలో ఉన్నత శిఖరాలను చేరుకోగలం’’ అని మోదీ పిలుపునిచ్చారు.

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా వేర్వేరు సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభలను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని