Modi: దిల్లీలో ఉండి.. స్వీడన్‌లో కారు నడిపిన మోదీ..!

మానవ జీవితంలో 5జీ సాంకేతిక తీసుకువచ్చే అనూహ్యమైన మార్పును ప్రధాని మోదీ స్వయంగా అనుభూతి పొందారు.

Published : 01 Oct 2022 15:32 IST

దిల్లీ: మానవ జీవితంలో 5జీ సాంకేతిక తీసుకువచ్చే అనూహ్యమైన మార్పును ప్రధాని మోదీ స్వయంగా అనుభూతి పొందారు. శనివారం ఈ కొత్త సేవలకు శ్రీకారం చుట్టిన సందర్భంగా.. దిల్లీలో 5జీ లింక్‌ను ఉపయోగించి ఐరోపాలో కారు నడిపారు. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో భాగంగా ఎరిక్‌సన్ కేంద్రం నుంచి స్వీడన్‌లో కారును నియంత్రించారు.

దీనికి సంబంధించిన చిత్రాన్ని కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘భారత్‌ ప్రపంచాన్ని నడిపిస్తోంది. ప్రధాని మోదీ 5జీ సాంకేతికతను ఉపయోగించి.. స్వీడన్‌లో కారు నడిపి చూశారు’ అని రాసుకొచ్చారు. దిల్లీ ప్రగతి మైదాన్‌లో 6వ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ - 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని.. దీంతో పాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను మోదీ ఆసక్తిగా తిలకించారు. ఈ సేవల సామర్థ్యానికి సంబంధించిన డెమోను రిలయన్స్‌ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు 5జీ టెక్నాలజీ శ్రీకారం చుట్టబోతోందన్నారు. 21వ శతాబ్దంలో ఇది చరిత్రాత్మకమైన రోజని అభివర్ణించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని