Modi: హీట్‌వేవ్, వర్షాకాల సంసిద్ధతపై నేడు మోదీ కీలక సమీక్ష

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొన్న హీట్‌వేవ్‌, రానున్న మాన్‌సూన్‌ సీజన్‌పై సంసిద్ధతను తెలుసుకునేందుకు గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన ఒక కీలక సమావేశం జరగనుంది.

Updated : 05 May 2022 13:37 IST

ఒక రోజులో ఎనిమిది సమావేశాల్లో పాల్గొననున్న ప్రధాని

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొన్న హీట్‌వేవ్‌, రానున్న మాన్‌సూన్‌ సీజన్‌పై సంసిద్ధతను తెలుసుకునేందుకు గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఐరోపా పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన రోజు వ్యవధిలో ఏడు నుంచి ఎనిమిది సమావేశాలను నిర్వహించనున్నారని తెలిపాయి.

వడగాలుల ప్రభావంతో దేశంలో పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సమయంలో దిల్లీ సహా మరికొన్ని చోట్ల కురిసిన వర్షాలకు ప్రజలు సూర్యుడి భగభగ నుంచి కాస్త బయటపడ్డారు. అయితే, ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి మళ్లీ పెరుగుతాయని, వడగాడ్పులు ప్రభావం కనిపిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల వారాల్లో కార్చిచ్చు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మామూలుగా ఈ సమయంలో అక్కడ వర్షం, వడగండ్లు, మరికొన్ని చోట్ల మంచు కూడా కురుస్తోంది. అయితే, రెండు నెలలుగా ఎలాంటి వానలు లేకపోవడంతో అక్కడ కార్చిచ్చు ఘటనలు ఎక్కువయ్యాయి.

మరోపక్క విద్యుత్తు కొరత వేధిస్తోంది. ఎండలు పెరగడంతో పెరిగిన విద్యుత్తు డిమాండ్ బొగ్గు నిల్వలపై ప్రభావం చూపింది. దాంతో నిల్వల పెంపు నిమిత్తం ప్రయాణికుల రైళ్లను రద్దు చేసి, బొగ్గు రవాణా రైళ్లను అధిక సంఖ్యలో తిప్పుతున్నారు. ఇక మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా మోదీ.. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో పర్యటించారు. ఆయన ఈ రోజు భారత్‌కు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని