Published : 10 Aug 2022 16:13 IST

Nitish kumar: 2014లో మోదీ విన్నరే.. 2024లో గెలుస్తారా?: నీతీశ్‌

పట్నా: బిహార్‌లో మహాకూటమి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బిహార్‌ ముఖ్యమంత్రిగా జేడీ(యు) అధినేత నీతీశ్‌ కుమార్‌ (Nitish kumar) ఎనిమిదోసారి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదంటూ భాజపా చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం బాగానే నడుస్తుందని వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో భాజపా ఆందోళన చెందుతోందన్నారు. కేంద్రంలో భాజపాను గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ గెలిచారనీ.. కానీ 2024లో ఆ పార్టీకి ఉండే అవకాశాలపై ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 2024లో ఆయన గెలుస్తారా? అన్నదే తన ప్రశ్న అన్నారు. ప్రధాని పదవికి తాను పోటీదారుగా లేనన్నారు. భాజపాను వీడాలని తమ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని నీతీశ్‌ పునరుద్ఘాటించారు.

తేజస్వీ కుటుంబ సభ్యుల ఆనందం

మరోవైపు, నీతీశ్‌తో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. తేజస్వీ సతీమణి  రాజశ్రీ అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే, ఇదంతా బిహార్‌ ప్రజల మంచికోసమేనని.. అందరూ సంతోషంగా ఉన్నారని తేజస్వీ తల్లి, బిహార్‌ మాజీ సీఎం రబ్డీదేవి వ్యాఖ్యానించారు. పనిచేసేందుకే తాము అధికారంలోకి వచ్చినట్టు తేజస్వీ సోదరుడు తేజ్‌ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని