Modi: దానిని మీరు ఆపకూడదు: హిమాచల్ వాసులకు మోదీ లేఖ

హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఈ రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Updated : 11 Nov 2022 14:47 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేసిందన్నారు. శనివారం అక్కడ  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

‘2014లో మేం అధికారంలోకి వచ్చిన సమయంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో వేరే పార్టీ ప్రభుత్వం ఉంది. ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయలేదు. అనంతరం ఇక్కడ భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులను మేం వేగవంతం చేశాం. వాటిని మీరు ఇప్పుడు ఆపకూడదు. ఉజ్వల్‌ పథకం, టాయిలెట్స్ నిర్మాణం, ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీటి సరఫరా వంటి పథకాలు ఇప్పుడు ఫలితాలు చూపిస్తున్నాయి. అమ్మలు, సోదరీమణుల జీవితాలు బాగుపడ్డాయి. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది పర్యాటక కేంద్రంగా మారింది. రేపు అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి’ అని మోదీ ఆ లేఖలో కోరారు. 

హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. ఈ రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆప్‌ కూడా విస్రృత ప్రచారం చేపట్టింది. డిసెంబర్ ఎనిమిదిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని