మోదీ తలపాగా.. బహూకరించిందెవరంటే?

ప్రధాని నరేంద్ర మోదీ వస్త్రధారణ సందర్భానికి తగ్గట్టుగా విభిన్నంగా ఉంటుంది.

Updated : 26 Jan 2021 12:16 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వస్త్రధారణ సందర్భానికి తగ్గట్టుగా విభిన్నంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన ధరించే తలపాగాలు ఆకట్టునే రీతిలో ఉంటాయి. ఈసారి 72వ గణతంత్ర వేడుకలకు ఈ తరహా శైలిలోనే హాజరయ్యారు. అయితే ఈసారి ధరించిన తలపాగాకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది.

ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ముదురు కాషాయ రంగులో ఉన్న తలపాగాను ధరించారు. ఆయన స్వరాష్ట్రం గుజరాత్‌లోని జామ్‌ నగర్‌కు చెందిన రాజకుటుంబం దాన్ని బహూకరించింది. ఆ రాజకుటుంబం మొదటిసారి ఇలా దాన్ని బహుమతిగా అందివ్వడం గమనార్హం. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం..మొదటిసారి తలపాగాతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై ప్రసంగించారు. ఆ సందర్భంలో ముదురు రంగు తలపాగాను ధరించారు. అప్పటి నుంచి ఆయన సందర్భానికి తగ్గట్టుగా వాటిని ధరిస్తూ వస్తున్నారు. కాగా, ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకొని ప్రధాని జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, అమరవీరులకు నివాళి అర్పించారు. అయితే కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ సారి గణతంత్ర వేడుకలు పరిమిత స్థాయిలోనే జరిగాయి. త్రివిధ దళాల సైనిక పాటవాల ప్రదర్శన, శకటాల రూపంలో ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు మాత్రం ఎప్పటిలాగానే కొనసాగాయి.    

ఇవీ చదవండి:

మోదీ చిత్రం: 24 గంటల్లో మిలియన్ లైక్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు