కొవిడ్‌ రోగులంతా టీబీ పరీక్షలు చేయించుకోవాలి

కరోనా సోకిన రోగుల్లో కొంతమంది ట్యూబర్‌కులోసిస్‌(టీబీ) బారినపడుతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ తరహా కేసులు నిత్యం డజన్ల కొద్దీ వెలుగుచూస్తుండటం వైద్యులను కలవరపాటుకు

Updated : 21 Dec 2022 16:57 IST

కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు

దిల్లీ: కరోనా సోకిన రోగుల్లో కొంతమంది ట్యూబర్‌కులోసిస్‌(టీబీ) బారినపడుతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ తరహా కేసులు నిత్యం డజన్ల కొద్దీ వెలుగుచూస్తుండటం వైద్యులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్‌ బారినపడివారు టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అలాగే టీబీ రోగులు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచనలు చేసింది. అయితే కొవిడ్ కారణంగా టీబీ కేసులు పెరుగుతున్నాయడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌తో బాధపడుతున్నారని గతంలో బ్రిటన్‌లో జరిగిన అధ్యయనంలో వెల్లడైన సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక కొవిడ్‌ బారిన పడ్డవారిలో దాదాపు 200లక్షణాలు ఉంటాయని గుర్తించారు. కనీసం ఆరు నెలల వరకు తీవ్రమైన ఇబ్బందులు రోగులను వెంటాడుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని