Anil Deshmukh: అనిల్‌ దేశ్‌ముఖ్‌కు చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది......

Published : 14 Mar 2022 19:52 IST

ముంబయి: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్‌ పిటిషన్‌ను మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టు సోమవారం తిరస్కరించింది. డీఫాల్ట్‌ బెయిల్‌ నిరాకరణకు గురైన మరుసటి రోజే ఈ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించడం గమనార్హం.

ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు గతంలో సంచలనం అయ్యాయి. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అనంతరం గతేడాది నవంబర్‌ మొదటివారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు మాజీ మంత్రిని అరెస్టు చేశారు. అంతకముందే ఆయన పలు ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని