Monsoon Update: చల్లని కబురు.. ‘నైరుతి’ ముందే వచ్చేస్తోంది!

రైతన్నలకు చల్లని కబురు. దేశంలో వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు జీవన రేఖగా పరిగణించే నైరుతి ......

Published : 13 May 2022 18:41 IST

దిల్లీ: రైతన్నలకు చల్లని కబురు. దేశంలో వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు జీవన రేఖగా పరిగణించే నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించే అవకాశాలు ఉన్నాయి. మే 27న కేరళను తాకడంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వాస్తవానికి, జూన్‌ 1న రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాల్సి ఉండగా.. ఈసారి నాలుగు రోజులు ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య భారతదేశంలో కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో నైరుతి రుతుపవనాల ముందస్తుగా రావడం గమనార్హం.

అయితే, అంతకన్నా ముందే మే 15 నాటికే అండమాన్‌ నికోబార్‌ దీవులను రుతుపవనాలు తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ రుతు పవనాల ఆగమనంతోనే దేశంలో వర్షాకాలం మొదలైనట్టుగా పరిగణిస్తారు. మన దేశంలో దాదాపు సగం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు వర్షాధారమే. అందువల్ల జూన్‌ - సెప్టెంబర్‌ మాసాల మధ్య కురిసే వర్షాలపైనే దేశంలో దాదాపు సగానికి పైగా వ్యవసాయ సేద్యం ఆధారపడి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని