Parliament వర్షాకాల సమావేశాలకు డేట్‌ ఫిక్స్‌!

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఉభయ సభల సమావేశాలు జులై 19న ప్రారంభమై ఆగస్టు 13తో .....

Published : 29 Jun 2021 19:43 IST

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఉభయ సభల సమావేశాలు జులై 19న ప్రారంభమై ఆగస్టు 13తో ముగియనున్నట్టు సమాచారం. దాదాపు నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో 20 సిట్టింగ్‌లు ఉండే అవకాశం ఉంది. సాధారణంగా జులై మూడో వారంలో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమై.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ముగుస్తుంటాయి. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫారసు మేరకు ఈ తేదీలు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో కొవిడ్‌ నిబంధనల మధ్య ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. మరోవైపు, కరోనా సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కోవడంలో కేంద్రం వైఫల్యం, వ్యవసాయ చట్టాలు రద్దు తదితర అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని