ఎన్నికల ముందు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం!

కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2013 కేరళ ‘సోలార్‌ స్కామ్‌’లో ప్రధాన నిందితురాలైన మహిళపై లైంగిక వేధింపుల కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Updated : 25 Jan 2021 04:09 IST

తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2013 కేరళ ‘సోలార్‌ స్కామ్‌’లో ప్రధాన నిందితురాలైన మహిళపై లైంగిక వేధింపుల కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ.. సహా మరో ఐదు మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌ వర్గాలు మండిపడ్డాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

ఈ పరిణామాలపై మాజీ సీఎం చాంది మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో ప్రభుత్వం 2018లోనే నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి కూడా ఇప్పటికీ ఎందుకు ఏ చర్య తీసుకోలేకపోయింది? అంతేకాకుండా ఆ కేసును ఇప్పుడు ఎందుకు సీబీఐకి బదిలీ చేస్తున్నారు. దీనిపై సీఎం స్పందించాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని చెప్పారు. కేంద్ర మంత్రి వీ మురళీధరన్‌ సైతం ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించిందని అన్నారు. కాగా ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయరాఘవన్‌ ఖండించారు. 

సోలార్‌ స్కామ్‌లో ప్రధాన నిందితురాలిగా ఉన్న మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో.. కేరళ మాజీ సీఎం చాందీ సహా మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ కేసును కేరళ క్రైంబ్రాంచ్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోలార్‌ యూనిట్ల ఏర్పాటు పేరుతో కోట్ల రూపాయల మేర అవకతవకలకు పాల్పడిన కేసులో సదరు మహిళ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. 

ఇదీ చదవండి

యూఎస్‌లో కొత్త ఆశలకు రెక్కలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని