Bengaluru: 499 కొత్త కేసుల్లో 263 మంది చిన్నారులే!

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్‌ (మూడో దశ) చిన్న పిల్లలకు ప్రమాదకరమని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

Published : 14 Aug 2021 01:14 IST

బెంగళూరు: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్‌ (మూడో దశ) చిన్న పిల్లలకు ప్రమాదకరమని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. గడిచిన వారం రోజుల్లో అక్కడ సుమారు 500 మంది చిన్నారులు వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) శుక్రవారం వెల్లడించింది.

ఆ వివరాల ప్రకారం.. కొవిడ్ బారిన పడ్డ చిన్నారుల్లో తొమ్మిదేళ్ల లోపు వారు 88 మంది ఉన్నారు. అలాగే 10- 19 ఏళ్ల వయసున్న పిల్లలు 305 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన కేసులు 499 కాగా అందులో 263 కేసులు గత ఐదు రోజుల్లోనే నమోదయ్యాయి. వీటిలో 9 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు 88 మంది ఉండగా.. 10-19 ఏళ్ల మధ్య వయసు గలవారు 175 మంది ఉన్నారని గణాంకాలు వెల్లడించాయి.

ఈ విషయంపై బీబీఎంపీ ఆరోగ్య కమిషనర్ రణదీప్ మాట్లాడుతూ.. ‘రోజువారీగా నమోదయ్యే కేసులను పరిశీలిస్తుంటే కొంత పెరుగుతున్నట్లు తెలుస్తుంది. కానీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జులై నెలాఖరు నుంచి ఆగస్టు మొదటి వారం వరకు నమోదైన కేసులను పరిశీలించాం. అందులో వైరస్‌ సోకిన 0-19 మధ్య వయస్సు గలవారు 14% కంటే తక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఇప్పటివరకూ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న చిన్నారులనే గుర్తించాం. చాలా వరకు పిల్లలు ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. గత 10 రోజుల్లో వైరస్‌ సోకి ఎవరూ మరణించలేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని