కరోనా మరణాలు ఆ రాష్ట్రాల్లోనే అధికం

దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది

Updated : 05 May 2021 16:42 IST

న్యూదిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, మహారాష్ట్రలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, బెంగళూరు, చెన్నై నగరాల్లో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘రోజువారీ కరోనా కేసుల్లో 2.4శాతం పెరుగుదల ఉంది. దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, చెన్నైలో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టకపోతే.. వైద్య సేవల నిర్వహణ మరింత కష్టమవుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, దిల్లీ, హరియాణాలో ఎక్కువ కరోనా మరణాలు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో ఒక్క బెంగళూరు నగరంలో 1.49 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చెన్నైలో ఈ సంఖ్య 38వేలుగా ఉంది. కొలికోడ్‌, ఎర్నాకుళం, గురుగ్రామ్‌ జిల్లాల్లోనూ కరోనా కేసుల పెరుగుదల గణనీయంగా ఉంది’’

‘‘మే 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ పాలసీని కేంద్రం సవరించింది. ఇందులో భాగంగా 9 రాష్ట్రాల్లో 6.71లక్షల మంది 18-44ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 12 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏడు రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో 1.5లక్షల యాక్టివ్‌ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది’ అని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని