Corona: మహమ్మారికి 1500 మంది వైద్యులు బలి

కరోనా సమయంలో రోగులకు ఎల్లవేళలా సేవలందించిన వైద్యుల్లో చాలామంది మహమ్మారి బారిన పడ్డారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 1500 మందికి పైనే వైద్యులను కొవిడ్‌ బలి తీసుకుంది.

Published : 25 Jun 2021 20:36 IST

దిల్లీ: కరోనా సమయంలో రోగులకు ఎల్లవేళలా సేవలందించిన వైద్యుల్లో చాలామంది మహమ్మారి బారిన పడ్డారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 1500 మందికి పైనే వైద్యులను కొవిడ్‌ బలి తీసుకుంది. ఈ మేరకు భారత వైద్య మండలి(ఐఎంఏ) గణాంకాలు వెల్లడించాయి. 

కరోనా రెండో దశ ఉద్ధృతిలో ఇప్పటివరకు 776 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐఎంఏ తెలిపింది. అత్యధికంగా బిహార్‌లో 115 మంది డాక్టర్లు కొవిడ్‌తో మరణించారు. ఆ తర్వాత దిల్లీలో 109 మంది, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 79, పశ్చిమ్‌ బెంగాల్‌లో 62, రాజస్థాన్‌లో 43, ఝార్ఖండ్‌లో 39, ఆంధ్రప్రదేశ్‌లో 38 మంది వైద్యులు మృతి చెందినట్లు పేర్కొంది. రెండో దశలో ఎనిమిది మంది గర్భిణులైన డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే తొలి దశలో 748 మంది డాక్టర్లను మహమ్మారి పొట్టన పెట్టుకుంది. 

అయితే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని వైద్య మండలి భావిస్తోంది. ఎందుకంటే.. ఐఎంఏ రికార్డుల ప్రకారం 3.5 లక్షల మంది డాక్టర్లు మాత్రమే ఇందులో సభ్యులుగా ఉండగా.. దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైనే వైద్యులు ఉన్నారు. మరోవైపు వైద్యులు పూర్తి స్థాయిలో టీకాలు తీసుకోకపోవడం అధిక మరణాలకు దారితీస్తుండొచ్చని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ జేఏ జయలాల్‌ గతంలో అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని