Delta: భారత్‌లో ‘డెల్టా’కు 2.40 లక్షల ప్రాణాలు బలి!

ప్రమాదకర డెల్టా వేరియంట్‌.. గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య భారత్‌లో 2,40,000 మంది ప్రాణాలను బలిగొందని ఐరాస 

Updated : 14 Jan 2022 10:30 IST

ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఈ మరణాలు సంభవించాయి
భవిష్యత్తులోనూ పునరావృతం!
హెచ్చరించిన ఐరాస నివేదిక

ఐరాస: ప్రమాదకర డెల్టా వేరియంట్‌.. గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య భారత్‌లో 2,40,000 మంది ప్రాణాలను బలిగొందని ఐరాస తాజా నివేదిక ఒకటి పేర్కొంది. ఆర్థిక పునరుజ్జీవానికీ ఈ వేరియంట్‌ భారీ దెబ్బ కొట్టిందని వివరించింది. సమీప భవిష్యత్తులోనూ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావచ్చని హెచ్చరించింది. ఈ మేరకు ‘యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ సిట్యుయేషన్‌ అండ్‌ ప్రాస్పెక్టర్‌-2022’ గురువారం తాజా నివేదికను విడుదల చేసింది. ‘‘ఒమిక్రాన్‌ అత్యంత తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రపంచ వ్యాప్త టీకా కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టనంత వరకూ... మహమ్మారి సవాళ్లు విసురుతూనే ఉంటుంది. దీంతో ప్రపంచం ఆర్థికంగా కోలుకోవడానికి ఇబ్బందులు తప్పవు. దక్షిణాసియా ప్రాంతంలో టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. ఫలితంగా అక్కడ కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు ఉంది. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్‌లలో డిసెంబరు నాటికి కేవలం 26% మంది జనాభాకే వ్యాక్సిన్లు అందించారు’’ అని నివేదిక పేర్కొంది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని