Cyrus Poonawalla: ‘మా టీకాలతో మూడు కోట్లకుపైగా ప్రాణాలు కాపాడాం’

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) తక్కువ ధరకే ఉత్పత్తి చేస్తున్న టీకాలు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా ప్రజల ప్రాణాలను కాపాడినట్లు సంస్థ ఛైర్మన్‌ సైరస్ పూనావాలా తెలిపారు. సోమవారం పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో...

Published : 15 Feb 2022 01:41 IST

ముంబయి: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) తక్కువ ధరకే ఉత్పత్తి చేస్తున్న టీకాలు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా ప్రజల ప్రాణాలను కాపాడినట్లు సంస్థ ఛైర్మన్‌ సైరస్ పూనావాలా తెలిపారు. సోమవారం పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సైరస్‌ పాల్గొని ప్రసంగించారు. ‘తక్కువ ధరకే వ్యాక్సిన్లు.. అధిక పనితీరు.. ఇదే మా విజయ రహస్యం’ అని ఈ సందర్భంగా తెలిపారు. 170కి పైగా దేశాల్లో పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఎస్‌ఐఐ వ్యాక్సిన్లు ఉపయోగపడ్డాయని చెప్పారు. సంస్థ తయారు చేసిన టీకాల కారణంగానే వారి ప్రాణాలు నిలిచినట్లు తాను చెప్పగలనన్నారు.

సంస్థ తొలి రోజులను గుర్తుచేసుకుంటూ.. పుణెలోని ఓ మారుమూల ప్రాంతంలో కంపెనీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడి శాస్త్రవేత్తలు క్రమంగా ప్రపంచంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. తమ సంస్థ.. అభివృద్ధి చెందుతోన్న దేశాలను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్లు రూపొందిస్తోందని వెల్లడించారు. ఇంత తక్కువ ఖర్చుతో కరోనా టీకా ‘కొవిషీల్డ్‌’ ఉత్పత్తి ఎలా సాధ్యమని చాలామంది ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. భారత్‌లో ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ కేంద్రంగా పేరుగాంచిన సీరం ఇన్‌స్టిట్యూట్‌.. ఆస్ట్రాజెనెకా టీకాను స్థానికంగా కొవిషీల్డ్‌ పేరుతో ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని