అమెరికాలో 6 లక్షలు దాటిన కొవిడ్‌ మరణాలు

రోజురోజుకూ కొత్తరూపు సంతరించుకుంటూ మానవాళిని అతలాకుతలం చేస్తున్న కొవిడ్‌ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఇప్పటి వరకు కేసుల సంఖ్య, మరణాల నమోదులో ముందు వరుసలో ఉన్న అమెరికాలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 6 లక్షలు

Published : 16 Jun 2021 01:22 IST

అమెరికా: రోజురోజుకూ కొత్తరూపు సంతరించుకుంటూ మానవాళిని అతలాకుతలం చేస్తున్న కొవిడ్‌ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఇప్పటి వరకు కేసుల సంఖ్య, మరణాల నమోదులో ముందు వరుసలో ఉన్న అమెరికాలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 6 లక్షలు దాటింది. అమెరికాలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అమలవుతుండడంతో కరోనా తీవ్రత తగ్గి మరణాల సంఖ్య గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పడతున్నట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాలు తెలుపుతున్నాయి.

గత జనవరి నాటికి అమెరికాలో ప్రతిరోజూ 3000 మరణాలకు సంభవించాయి. ఆదివారం 360 మరణాలు సంభవించాయి. జులై నాలుగో తేదీ వరకు అమెరికాలో 60 ఏళ్లు దాటిన వారిలో 70 శాతం మందికి కనీసం వ్యాక్సిన్‌ ఒక డోస్‌ అందించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఇక యూఎస్‌ జనాభాలో సగం జనాభాకు పైగా కనీసం ఒక డోసు పొందినట్లు, 43 శాతం జనాభా పూర్తి స్థాయిలో టీకా తీసుకున్నట్లు సీడీసీ తెలిపింది. ఇక ప్రపంచంలో కేసుల పరంగా అమెరికా ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ఆదేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3.34 కోట్లను దాటింది. వారిలో 3.28 లక్షల ప్రజలు కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని