National News:మైనర్లను పెళ్లాడిన 2,044 మంది అరెస్టు

మైనర్లను వివాహం చేసుకున్న వ్యక్తులపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.  శుక్రవారం భారీ ఆపరేషన్‌ చేపట్టిన పోలీసులు మైనర్లను పెళ్లి చేసుకున్న 2,044 మందితో సహా వారి వివాహం నిర్వహించిన 51మంది పూజారులను అరెస్టు చేశారు.

Published : 04 Feb 2023 09:31 IST

మైనర్లను వివాహం చేసుకున్న వ్యక్తులపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.  శుక్రవారం భారీ ఆపరేషన్‌ చేపట్టిన పోలీసులు మైనర్లను పెళ్లి చేసుకున్న 2,044 మందితో సహా వారి వివాహం నిర్వహించిన 51మంది పూజారులను అరెస్టు చేశారు. మరికొన్ని రోజులు ఈ ఆపరేషన్‌ సాగుతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ఇప్పటివరకూ బాల్య వివాహాలకు సంబంధించి 8 వేల మంది నిందితుల జాబితా తమ దగ్గర ఉందని.. 4 వేల మందిపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు.  14 ఏళ్ల లోపు వయసున్న బాలికలను వివాహం చేసుకున్న వారికి పోక్సో చట్టం కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించనున్నట్లు హిమంత గతంలో ప్రకటించారు. భారీ ఎత్తున మహిళలు నిరసనకు దిగారు. తమ భర్తలను, కుమారులను అరెస్టు చేస్తే ఎలా జీవించాలని.. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని