Omicron: దిల్లీలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ కలకలం!

దిల్లీలో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బయటపడినట్లు ప్రముఖ లోక్‌నాయక్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు........

Published : 11 Aug 2022 01:29 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉన్నప్పటికీ.. దిల్లీలో మాత్రం గత కొద్దిరోజులుగా నిత్యం రెండువేలకు పైగానే వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే పరీక్షల్లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బయటపడినట్లు లోక్‌నాయక్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. కొంతమందిలో అత్యంత వ్యాప్తి కలిగిన ఉపవేరియంట్‌ బీఏ 2.75ను గుర్తించినట్లు మెడికల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డా.సురేశ్‌ కుమార్‌ తెలిపారు.

ఈ వేరియంట్‌ యాంటీబాడీలు ఉన్నవారిలోనూ, టీకాలు తీసుకున్నవారిపైనా ప్రభావం చూపుతుందని డా.సురేశ్‌ పేర్కొన్నారు. ‘అనుమానంతో 90 మంది నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్‌ ఉపవేరియంట్‌ బీఏ 2.75ను గుర్తించాం. టీకాలు తీసుకున్నవారిపైనా, యాంటీబాడీలు ఉన్నవారిపైనా ఈ ఉపవేరియంట్‌  ప్రభావం చూపుతుంది’ అని వెల్లడించారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

దిల్లీలో మంగళవారం 2,445 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గత ఫిబ్రవరి నుంచి దిల్లీలో ఇవే అత్యధిక కేసులు. దీంతో పాజిటివిటీ రేటు 15.41శాతానికి చేరింది. వైరస్‌తో ఏడుగురు మృతిచెందారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని