Published : 06/10/2021 15:18 IST

Lakhimpur Kheri Violence: కొడుకుపై హత్యారోపణలు.. అమిత్‌ షాను కలిసిన అజయ్ మిశ్రా

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా.. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ ఉదయం షా నివాసానికి వెళ్లిన మిశ్రా.. దాదాపు అరగంట పాటు ఆయనతో భేటీ అయ్యారు. లఖింపుర్‌లో ఆదివారం చోటుచేసుకున్న ఘర్షణలను ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. 

లఖింపుర్‌ హింసాకాండ నేపథ్యంలో మిశ్రాను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై హత్యా నేరం కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మిశ్రా.. అమిత్ షాతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ ఘటనలో ఆశిష్‌ మిశ్రా పోలీసులకు లొంగిపోయే యోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

అయితే తన కుమారుడిపై వస్తున్న వార్తలను అజయ్‌ మిశ్రా ఖండించారు. ఘటనకు కారణమైన వాహనం తమదేనని, అయితే అందులో తన కుమారుడు లేడని తెలిపారు. అంతేగాక, ఆందోళనకారులు రాళ్లు విసరడం వల్లే వాహనం అదుపుతప్పి రైతుల మీదకు దూసుకెళ్లిందని వెల్లడించారు. ఆ తర్వాత రైతులు జరిపిన దాడిలో వాహనంలో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని