IMD: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో.. అధిక ఉష్ణోగ్రతలే!

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ మధ్య కాలంలో సాధారణం కన్నా అధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Published : 01 Apr 2023 22:11 IST

దిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ మధ్య కాలంలో వాయువ్య భారతం, ద్వీపకల్ప ప్రాంతం (Peninsular region) మినహాయించి.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. మధ్య, తూర్పు, వాయువ్య భారత్‌లో అనేక చోట్ల సాధారణం కన్నా ఎక్కువగా వేడిగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ‘బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణాల్లో వడగాలులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది’ అని వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మీడియాకు తెలిపారు.

‘2023 ఏప్రిల్- జూన్ వరకు.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ ద్వీపకల్పంతోపాటు వాయువ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలకు అవకాశం ఉంది’ అని ఐఎండీ తెలిపింది. మరోవైపు.. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. ద్వీపకల్ప భాగంతోపాటు వాయువ్య, మధ్య భారత్‌లోని అనేక ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కన్నా ఎక్కువ.. తూర్పు, ఈశాన్య భారత్‌లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని