MotoGP: భారత మ్యాప్‌ను తప్పుగా చూపిన మోటోజీపీ.. నెటిజన్ల మొట్టికాయలతో సారీ!

మోటార్‌బైక్‌ రేసింగ్‌ కార్యక్రమంలో మోటోజీపీ ప్రదర్శించిన వీడియోలో భారత మ్యాప్‌ను తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. దీనిపై భారతీయ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 22 Sep 2023 18:15 IST

దిల్లీ: అంతర్జాతీయ మోటార్‌ బైక్‌ రేసింగ్‌ మోటోజీపీ (MotoGP) తొలిసారిగా భారత్‌లో జరుగుతోంది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా ప్రదర్శించిన వీడియోలో భారత పటాన్ని మోటోజీపీ తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్ధాఖ్‌లు లేకుండా మ్యాప్‌ను ప్రదర్శించడంపై భారతీయ నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మోటోజీపీ క్షమాపణలు కోరింది. ఈ మేరకు మోటోజీపీ అధికారిక ఎక్స్ (Twitter) ఖాతాలో పోస్టు పెట్టింది.

‘‘మోటోజీపీ వీడియో ప్రసారంలో భారత పటాన్ని తప్పుగా చూపించినందుకు భారతీయ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాం. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాలనే ఉద్దేశం మాకు లేదు. మా మద్దతు ఎప్పుడూ భారత్‌కు ఉంటుంది. భారత్‌లోని బుద్ధ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో తొలిసారిగా జరుగుతున్న ఇండియన్‌ ఆయిల్‌ భారత్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ను మీతో కలిసి ఆస్వాదిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం’’ అని ట్వీట్‌లో పేర్కొంది.

భారత్‌-కెనడాల మధ్య ఉద్రిక్తతలు.. విమాన టికెట్‌ ధరలకు రెక్కలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న బుద్ధ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ (Buddh International Circuit)లో సెప్టెంబరు 22- సెప్టెంబరు 24 వరకు మూడు రోజులపాటు మోటోజీపీ రేసింగ్‌ జరగనుంది. ఇందులో బైక్‌ రేసర్లు గంటకు 300 కి.మీ వేగంతో బైక్‌లను నడుపుతారు. తొలిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రాక్టీస్ సెషన్‌ నిర్వహిస్తారు. రెండో రోజు ఉదయం 10: 40 నుంచి 11:10 గంటల వరకు పాక్టీస్‌ సెషన్‌ ఉంటుంది. తర్వాత మొదటి, రెండు క్వాలిఫైయింగ్‌ రౌండ్లను నిర్వహిస్తారు. మూడో రోజు వార్మప్‌ రేస్‌, ఫైనల్‌ రేస్‌ జరుగుతుంది. ఈ రేస్‌ను జియో సినిమా యాప్‌లో వీక్షించవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు