Farmer found Diamond: ఆ రైతు పొలంలో వజ్రాలు పండుతాయ్‌.. 

భూమినే నమ్ముకున్న ఓ రైతును అదృష్టం వరించింది. తన వ్యవసాయ భూమిలో తాజాగా ఆ రైతుకు సుమారు రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది.....

Published : 28 Aug 2021 18:39 IST

పన్నా: భూమినే నమ్ముకున్న ఓ రైతును అదృష్టం వరించింది. తన వ్యవసాయ భూమిలో తాజాగా ఆ రైతుకు సుమారు రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. రెండేళ్ల వ్యవధిలో అతడికి ఆరు వజ్రాలు దొరకడం విశేషం.

మధ్యప్రదేశ్‌లోని​ పన్నా జిల్లా జరువాపుర్​ గ్రామానికి చెందిన ప్రకాశ్​ మజుందార్​ అనే రైతుకు సుమారు రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. తన పొలంలో వజ్రాలు దొరుకుతాయని తెలుసుకున్న ఆయన ముగ్గురు స్నేహితులతో కలిసి తవ్వకాలు చేపట్టాడు. గతంలో వారికి 5 వజ్రాలు లభించాయి. అందులో 7.44 క్యారెట్ల వజ్రం కూడా ఉంది. కాగా తాజాగా రూ.30 లక్షల విలువచేసే వజ్రం దొరికింది.  ప్రకాశ్ దానిని ప్రభుత్వ జిల్లా వజ్రాల కార్యాలయంలో డిపాజిట్​ చేశాడు​. వేలం ద్వారా వచ్చే డబ్బును నలుగురూ సమానంగా పంచుకుని, వాటిని పిల్లల చదువు కోసం ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.

సొంత భూమిలో దొరికే వజ్రాలు, ఇతర విలువైన వస్తువులకు ప్రభుత్వం 12.50 శాతం వాటా ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే వస్తువు మొత్తం తనకే చెందుతుందని ఆ వ్యక్తి వాదిస్తే కేసు కోర్టుకు వెళుతుందని.. తన సొంత భూమిలోనే దొరికినట్లు నిరూపిస్తే వజ్రం అతనికే చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అలాకాకుండా దొరికిన వస్తువులను ప్రభుత్వానికి అప్పగించకుండా దాచే ప్రయత్నం చేస్తే అలాంటి వారిపై క్రిమినల్​ కేసు నమోదవుతుందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని