Supriya Sule: ఎంపీ సుప్రియా చీరకు నిప్పు.. త్రుటిలో తప్పిన ప్రమాదం!
ఓ కార్యక్రమంలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులె చీరకు దీపం తగిలి ఒక్కసారిగా నిప్పంటుకుంది. అయితే, సకాలంలో మంటను ఆర్పివేయడంతో ఆమెకు ప్రమాదం తప్పింది.
ముంబయి: ఎన్సీపీ(NCP) ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే(Supriya Sule)కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమంలో ఆమె చీరకు దీపం తగిలి ఒక్కసారిగా నిప్పంటుకుంది. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. సుప్రియా ఆదివారం పుణెలో ఓ కరాటే పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తుండగా.. ప్రమాదవశాత్తు దీపం తగిలి ఆమె చీరకు నిప్పంటుకుంది. అయితే, వెంటనే అప్రమత్తమైన ఆమె స్వయంగా మంటలను ఆర్పివేశారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ.. అనంతరం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Mrunal Thakur: ‘నా కథను అందరితో పంచుకుంటా..’ కన్నీళ్లతో ఉన్న ఫొటో షేర్ చేసిన మృణాల్
-
World News
Earthquake: పాక్, అఫ్గాన్‌లో భూకంపం.. 11 మంది మృతి..!
-
Ts-top-news News
RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Movies News
Anasuya: ప్రెస్మీట్లో కన్నీరు పెట్టుకున్న అనసూయ
-
World News
నీటి లోపల వంద రోజులు జీవిస్తే.. ప్రొఫెసర్ ఆసక్తికర ప్రయోగం!
-
Crime News
Vijayawada: విజయవాడలో డ్రగ్స్ స్వాధీనం