Published : 28 Nov 2021 13:25 IST

MSRTC: ఆరు వేల మంది ఉద్యోగుల్ని సస్పెండ్‌ చేసిన మహారాష్ట్ర ఆర్టీసీ!

ముంబయి: మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎంఎస్‌ఆర్టీసీ)ను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. కాగా.. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎంఎస్‌ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం 3,010 మంది ఉద్యోగులను ఎంఎస్‌ఆర్టీసీ సస్పెండ్‌ చేసింది. మరో 270 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్‌ అయిన ఉద్యోగుల సంఖ్య 6,277కి చేరగా.. 1,496 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. 

ఇటీవల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి.. ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు వెంటనే విధుల్లోకి చేరాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మొత్తం 92,266 మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో 18వేల మందికిపైగా శనివారం విధుల్లో చేరారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 250 డిపోలు ఉండగా.. 50 డిపోల్లో బస్‌ సేవలు పునరుద్ధరించామని, త్వరలో పూర్తిస్థాయిలో ఆర్టీసీ సేవలు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. 

Read latest National - International News and Telugu News

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని