Anant Ambani Wedding: బుల్లి వారసులతో ముకేశ్‌-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?

Anant Ambani Wedding: అనంత్‌ అంబానీ-రాధిక మర్చెంట్‌ సంగీత్‌ వేడుక అట్టహాసంగా జరిగింది. పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.

Updated : 06 Jul 2024 11:20 IST

Anant Ambani-Radhika Merchant Wedding | ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి ఆకాశాన్నంటుతోంది. ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ వివాహం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఇప్పటికే వేడుకలు మొదలవ్వగా.. శుక్రవారం రాత్రి సంగీత్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో ముకేశ్‌ (Mukesh Ambani), ఆయన సతీమణి నీతా అంబానీ (Nita Ambani) తమ బుల్లి వారసులతో కారు షికారు చేస్తూ కన్పించారు.

వింటేజ్‌ ఓపెన్‌ టాప్‌ కారులో ముకేశ్ అంబానీ డ్రైవింగ్‌ చేస్తుండగా నీతా, మనవళ్లు పృథ్వి, కృష్ణ, మనవరాళ్లు ఆద్యశక్తి, వేద పక్కన కూర్చున్నారు. అలనాటి బాలీవుడ్‌ నటుడు షమ్మీ కపూర్‌ నటించిన ‘బ్రహ్మచారి’ సినిమాలోని ‘చక్కే మే చక్కా’ పాటను పాడుతూ వారు షికారు చేస్తున్నట్లుగా ఉన్న వీడియోను సంగీత్‌ (Sangeet)లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అంబానీ కుటుంబం డ్యాన్స్‌..

ఇక సంగీత్‌ వేడుకల్లో అంబానీ కుటుంబమంతా (Ambani Family) కలిసి చేసిన డ్యాన్స్‌ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది. బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలోని ‘దీవాంగీ.. దీవాంగీ’ పాటకు ముకేశ్‌-నీతా, ఆకాశ్‌-శ్లోకా, ఈశా-ఆనంద్‌ పిరమాల్‌, అనంత్‌-రాధిక ఆడిపాడారు. నీతా అంబానీ సంప్రదాయ భరతనాట్యం స్టెప్పులతో ఆకట్టుకున్నారు.

ఈ వేడుకకు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సల్మాన్‌ ఖాన్‌, విక్కీ కౌశల్‌, రణ్‌వీర్‌ సింగ్‌-దీపికా పదుకొణె, కియారా ఆడ్వాణీ-సిద్ధార్థ్‌ మల్హోత్రా, అలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌, ధోనీ, హార్దిక్‌ పాండ్య తదితర ప్రముఖులు హాజరయ్యారు. సల్మాన్‌తో కలిసి అనంత్‌ అంబానీ స్టెప్పులేశాడు. పాప్‌ స్టార్‌ జస్టిన్‌ బీబర్‌ ఇందులో ప్రదర్శన ఇచ్చాడు. జులై 12-14 తేదీల్లో ముంబయి (Mumbai)లోని జియో సెంటర్‌ వేదికగా అనంత్‌-రాధిక వివాహం జరగనున్న సంగతి తెలిసిందే.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని