Mukul Rohatgi: కేంద్రం ఆఫర్‌ తిరస్కరించిన ముకుల్‌ రోహత్గి

సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి(Mukul Rohatgi) మరోసారి అటార్నీ జనరల్ ‌(ఏజీ)గా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ....

Updated : 25 Sep 2022 22:16 IST

దిల్లీ: సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి(Mukul Rohatgi) మరోసారి అటార్నీ జనరల్ ‌(ఏజీ)గా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. తదుపరి ఏజీగా బాధ్యతలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరించినట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏజీగా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్‌ (91) పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో ఆ పదవికి రోహత్గీ పేరును ఇటీవల కేంద్రం ప్రతిపాదించింది.

గతంలో 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు రోహత్గీ ఏజీగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2017 జులైలో కేంద్ర ప్రభుత్వం కేకే వేణుగోపాల్‌ను ఏజీగా నియమించింది. ఆయన మూడేళ్ల పదవీ కాలం 2020లోనే ముగిసినప్పటికీ.. అప్పటికి ఆయన వయస్సు 89 ఏళ్లు. దీంతో ఆయన వయస్సును దృష్టిలో పెట్టుకొని విశ్రాంతి ఇవ్వాలని వేణుగోపాల్‌ అప్పట్లో కేంద్రాన్ని కోరారు. దీంతో మరో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగాలని కేంద్రం అభ్యర్థించడంతో ఆయన కొనసాగారు. తాజాగా వేణుగోపాల్‌ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండంతో కొత్త వారిని నియమించడంపై కేంద్రం దృష్టి సారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని