Mumbai: ముంబయిలో భవనం కుప్పకూలి 14మంది మృతి!

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయినట్లు.....

Updated : 28 Jun 2022 17:47 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరగగా.. అప్పటి నుంచి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయి. శిథిలాల కింది నుంచి తొలుత ముగ్గురి మృతదేహాలను వెలికితీసిన సహాయక బృందాలు.. తాజాగా మరికొందరి మృతదేహాలను వెలికి తీశారు. ఇప్పటివరకు మొత్తంగా 23 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఘటనపై సమాచారం అందుకున్న మహారాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాల యజమానులకు గతంలోనే నోటీసులు అందించామని, వాటిని సీరియస్‌గా తీసుకోవాలని అభ్యర్థించారు.

మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం

మృతుల కుటుంబానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి ఉచిత చికిత్స అందిస్తామని తెలిపింది. ఈ దుర్ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మహామంత్రి సుభాష్ దేశాయ్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని