Published : 08 Jan 2021 17:05 IST

ముంబయి పేలుళ్ల సూత్రధారికి 15 ఏళ్ల జైలు

లాహోర్‌: ముంబయి పేలుళ్ల సూత్రధారికి జైలు శిక్ష పడింది. ఉగ్రవాదులకు నిధులు అందించారనే కేసులో లష్కరే కమాండర్‌ జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీకి 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడన్న అభియోగాలతో లఖ్వీని పాక్‌ ఉగ్రవాద నిరోధక శాఖ (సీడీటీ) గత శనివారం అరెస్టు చేయగా.. తాజాగా తీర్పు వెలువడింది. ముంబయి పేలుళ్ల కేసులో అరెస్టయిన లఖ్వీ.. 2015 నుంచి బెయిల్‌ పైనే ఉన్నాడు. అయితే, నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలు రావడంతో పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన (సీడీటీ) అతడిని అరెస్టు చేసింది. అయితే, ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. 2008 ముంబయి పేలుళ్ల ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన యావత్‌ ప్రపంచాన్ని కలచివేసిన విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని