shilpa shetty: శిల్పా శెట్టిపై మోసం కేసు!

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రాలు బోగస్‌ బంగారం పథకంతో తనను మోసగించారని ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబయి అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఎన్‌.పి. మెహతా ఆదేశించారు.

Published : 14 Jun 2024 06:21 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రాలు బోగస్‌ బంగారం పథకంతో తనను మోసగించారని ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబయి అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఎన్‌.పి. మెహతా ఆదేశించారు. కుంద్రా దంపతులు, వారు స్థాపించిన సత్‌యుగ్‌ గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దాని ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జి ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని