Mumbai: ‘మీ హోటల్‌లో బాంబులు పెట్టాం.. రూ.5కోట్లు ఇవ్వకపోతే పేల్చేస్తాం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న 26/11 తరహా పేలుళ్లకు
ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న 26/11 తరహా పేలుళ్లకు పాల్పడుతామంటూ ఓ పాకిస్థాన్ నంబరు నుంచి పోలీసులకు మెసేజ్ వచ్చింది. తాజాగా మరో ఫైవ్ స్టార్ హోటల్‌కు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. హోటల్‌లో బాంబులు అమర్చామని, రూ.5కోట్లు ఇవ్వకపోతే పేల్చేస్తామంటూ ఆగంతకులు ఫోన్ చేశారు. అయితే అది నకిలీ బెదిరింపు కాల్ అని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ముంబయిలోని ప్రముఖ లలిత్ హోటల్‌కు ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి హోటల్‌లో నాలుగు చోట్ల బాంబులు అమర్చినట్లు చెప్పారు. తమకు రూ.5కోట్లు ఇవ్వాలని, లేదంటే హోటల్‌ను పేల్చేస్తామని బెదిరించారు. దీంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌తో హోటల్‌కు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది నకిలీ బెదిరింపు కాల్‌గా ధ్రువీకరించిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల ముంబయి ట్రాఫిక్ పోలీసు హెల్ప్‌లైన్ నంబరుకు బెదిరింపు మెసేజ్‌లు రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ముంబయిలో 26/11 తరహా దాడులకు పాల్పడుతామని, నగరాన్ని పేల్చివేస్తామని ఆగంతకులు అందులో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల కోసం ఇప్పటికే కొంతమంది తమ మద్దతుదారులు భారత్‌లో పనిచేస్తున్నట్లు దుండగులు హెచ్చరించినట్లు తెలిపారు. ఆ ఫోన్ నంబరుకు పాకిస్థాన్ దేశ కోడ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు బెదిరింపులను తీవ్రంగా పరిగణించారు. తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Marriage: 28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ
-
Sports News
Australian open: కెరీర్ చివరి మ్యాచ్‌లో సానియాకు నిరాశ.. మిక్స్డ్ డబుల్స్‌లో ఓటమి
-
India News
జన్మభూమి సేవలో అజరామరుడు.. కానిస్టేబుల్ అహ్మద్ షేక్‌కు మరణానంతరం శౌర్యచక్ర