Elon Musk: మస్క్ తనయుడికి సందేహం.. దిల్లీ పోలీసుల రిప్లయ్!
ఎలన్ మస్క్ (Elon Musk) తన కుమారుడి వచ్చిన సందేహాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేయగా, దానికి దిల్లీ పోలీసులు (Delhi Police) రిప్లయ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. కంపెనీకి సంబంధించిన విషయాలను నిత్యం ఫాలోవర్స్‌తో షేర్ చేస్తుంటారు. అంతేకాదు, కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి ఫాలోవర్ల అభిప్రాయం కోరుతుంటారు. కొన్నిసార్లు ఆయన చేసే ట్వీట్‌ల సారాంశం అర్థం చేసుకోవడం కష్టం. తాజాగా ఆయన తన మూడేళ్ల కొడుకు ఎక్స్ ఏఈ (X AE A-XII) తనను అడిగిన ప్రశ్నను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ ప్రశ్నకు దిల్లీ పోలీసులు (Delhi Police) చెప్పిన సమాధానం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
‘‘లిటిల్ ఎక్స్ నన్ను ఓ ప్రశ్న అడిగాడు. పోలీస్ కుక్కలు ఉన్నప్పుడు, పోలీస్ పిల్లులు ఎందుకు ఉండవు? అనే సందేహం వచ్చింది ’’ అని మస్క్ ట్వీట్ చేశారు. అయితే, ఈ ప్రశ్నకు దిల్లీ పోలీసులు స్పందించారు. ‘మస్క్.. మీ అబ్బాయికి చెప్పండి.. పోలీసు వ్యవస్థలో పిల్లులు ఉంటే వాటినే నేరస్థులుగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది’’ అని సరదాగా దిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. అయితే, దిల్లీ పోలీసులు రిప్లయ్‌కి నెటిజన్లు వివరణ ఇచ్చారు. సాధారణంగా ఇళ్లలో పిల్లులు ఇతరులకు తెలియకుండా పాలు, పెరుగు వంటి వాటిని స్వాహాచేస్తాయి. అది, వాటి స్వభావం. అందుకే వాటినే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పోలీసులు ట్వీట్ చేశారు అని కామెంట్ చేశారు. మరికొంతమంది, పోలీస్ కుక్కలతోపాటు , పిల్లులకు శిక్షణ ఇస్తే అవి రెండు గొడవపడుతూ.. నేరస్థులను విడిచిపెడతాయని నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!