Twitter: కొత్త రూల్స్‌ పాటించాల్సిందే: హైకోర్టు  

కొత్త ఐటీ చట్టంలోని డిజిటల్‌ మీడియా నిబంధనలను ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ పాటించాల్సిందేనని దిల్లీ హైకోర్టు ఆదేశించింది...

Published : 31 May 2021 21:36 IST

దిల్లీ: కొత్త ఐటీ చట్టంలోని డిజిటల్‌ మీడియా నిబంధనలను ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ పాటించాల్సిందేనని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనలను ట్విటర్‌ పాటించడంలేదంటూ అమిత్‌ ఆచార్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ అంశంపై తమ వైఖరి చెప్పాలంటూ కేంద్రంతో పాటు ట్విటర్‌కు దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ రేఖ పల్లి నోటీసులు జారీచేశారు. నూతన ఐటీ చట్టంలోని నిబంధనలను పాటిస్తున్నామని, రెసిడెంట్‌ గ్రీవెన్స్ అధికారిని సైతం నియమించినట్లు ట్విటర్‌ కోర్టుకు తెలిపింది. అయితే ట్విటర్ వాదనను కేంద్రం తప్పు పట్టింది. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. కొత్త నిబంధనలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. తదుపరి విచారణ వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని