Agnipath: అగ్నిపథ్‌పై ఏ నిర్ణయమైనా తీసుకొనే ముందు మా వాదన వినండి..!

అగ్నిపథ్‌పై దాఖలైన పిటిషన్లపై ఏదైనా  నిర్ణయమైనా తీసుకొనే ముందు తమ వాదన వినాలని సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నవించింది. ఈ మేరకు కేంద్రం న్యాయస్థానంలో

Published : 21 Jun 2022 11:22 IST

సుప్రీంకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

ఇంటర్నెట్‌డెస్క్‌:  అగ్నిపథ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు తమ వాదన వినాలని సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నవించింది. ఈ మేరకు న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం కేవియట్‌ దాఖలు చేసింది. ఇప్పటి వరకు అగ్నిపథ్‌పై సుప్రీం కోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మూడు పిటిషన్లలో దేనికి సంబంధించి కేంద్రం కేవియట్‌ దాఖలు చేసిందో మాత్రం వెల్లడించలేదు. న్యాయవాది హరీశ్‌ అజయ్‌ సింగ్‌ ఈ మేరకు ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్‌ వేశారు.

ఎంఎల్‌ శర్మ అనే న్యాయవాది ఇటీవల అగ్నిపథ్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి.. పలు అంశాలను ప్రస్తావించారు. వందల ఏళ్ల నుంచి ఉన్న ఎంపిక విధానాన్ని ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆరోపించారు. దీంతోపాటు ప్రభుత్వ నిర్ణయానికి పార్లమెంట్‌ అనుమతి లేదని పేర్కొన్నారు.

జాతీయ భద్రతపై అగ్నిపథ్ పథకం  ప్రభావాన్ని విశ్లేషించేందుకు ఒక కమిటీని వేయాలని గత వారం విశాల్‌ తివారీ అనే మరో న్యాయవాది పిటిషన్‌ వేశారు. దీంతోపాటు అగ్నిపథ్‌ ప్రకటన తర్వాత చెలరేగిన హింసపై విచారణ నిర్వహించేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని