మయన్మార్:  సైనిక నేత కీలక ఆదేశాలు

మయన్మార్‌ సైనిక ప్రభుత్వం, అక్కడి పౌరుల వ్యక్తిగత హక్కులను కాలరాసే దిశగా మరో అడుగు వేసింది.

Published : 14 Feb 2021 20:39 IST

వ్యక్తిగత హక్కులకు విఘాతం

నైపీతా: మయన్మార్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక ప్రభుత్వం, అక్కడి పౌరుల వ్యక్తిగత హక్కులను కాలరాసే దిశగా మరో అడుగు వేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని తొలగించిన సైన్యం.. అధ్యక్షుడు యూ విన్‌ మింట్‌, ప్రభుత్వ నేత ఆంగ్‌ సాన్‌ సూకిలతో సహా పలువురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం పౌర నిరసనలను కట్టడి చేసేందుకు పలురకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలను అందుబాటులో లేకుండే చేసేందుకు విఫల యత్నం చేసింది. ఇప్పుడు తాజాగా ఆ దేశ పౌరుల వ్యక్తిగత స్వాతంత్ర్యం, భద్రతలకు రక్షణ కల్పించే చట్టాలను సవరిస్తూ భద్రతా దళాల కమాండర్‌ ఇన్‌ చీఫ్‌, సైనిక ప్రభుత్వ నేత సెన్‌ జెన్‌ మిన్‌ యాంగ్‌ లయింగ్‌  ఆదేశాలు జారీ చేశారు.

దీనిలో భాగంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రతల రక్షణ చట్టం లోని 5,7,8 సెక్షన్లను రద్దు చేశారు. ఈ ఆదేశాలు అత్యయిక పరిస్థితి విధించిన ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించారు. కాగా, మయన్మార్‌ సైనిక ప్రభుత్వ తాజా చర్య మరోసారి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విమర్శలను ఎదుర్కోవటం తప్పదని పరిశీలకులు అంటున్నారు.

ఇవీ చదవండి..

మయన్మార్‌లో నిరసనలపై ఉక్కుపాదం

నిరసనలతో హోరెత్తిన మయన్మార్‌

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts