బయట తిరిగినా కాల్చేస్తున్నారు!

మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్నవారిని కాల్చివేయాలన్న సైనిక ఆదేశాలతో కొందరు పోలీసులు కర్కషంగా వ్యవహరిస్తున్నారు....

Published : 22 Mar 2021 13:24 IST

యాంగూన్‌: మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్నవారిని కాల్చివేయాలన్న సైనిక ఆదేశాలతో కొందరు పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ పౌరుడిని వెంబడించిన పోలీసులు ఎటువంటి వివరాలు అడగకుండానే అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మరికొందరు పోలీసులు వేరే ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యాలు ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌తో చిత్రీకరించారు.

ఈ ఏదాడి ఫిబ్రవరి 1న మయన్మార్‌ను అదుపులోకి తీసుకున్న ఆ దేశ సైన్యం అరాచక పాలన కొనసాగిస్తోంది. సైన్యం తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతోంది. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో వందల సంఖ్యలో మృతిచెందారు. వేల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారు. హింసను ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా.. వాటిని పెడచెవిన పెట్టిన సైన్యం హింసకు పాల్పడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు