సైనిక పాలనలో 500 మందికిపైగా బలి

మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం సృష్టిస్తున్న మారణహోమంలో ఇప్పటివరకు అధికారికంగా 500 మందికిపైగా పౌరులు మృతిచెందినట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది....

Published : 31 Mar 2021 10:59 IST

యాంగూన్‌: మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం సృష్టిస్తున్న మారణహోమంలో ఇప్పటివరకు అధికారికంగా 500 మందికిపైగా పౌరులు మృతిచెందినట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. దాదాపు రెండు నెలల క్రితం మయన్మార్‌లో జరిగిన సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఊహించని విధంగా ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఈ ఆందోళనలను అణచివేసేందుకు సైన్యం అత్యంత కర్కషంగా వ్యవహరిస్తోంది. కనిపించిన వారిని కనిపించినట్లే కాల్చివేస్తోంది. తాజాగా తమ దేశ పౌరుల పైనే వైమానిక దాడులు చేయడంతో వేలాదిమంది మయన్మార్‌ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సమీప థాయ్‌లాండ్‌ సహా తదితర దేశాలకు వలస పోతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని