Mysterious sounds: భూమి నుంచి చెవిపగిలిపోయే శబ్దాలు.. వణికిపోతున్న ప్రజలు

Mysterious sounds: కేరళ (Kerala)లోని ఓ గ్రామంలో వస్తోన్న భారీ వింత శబ్దాలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ మిస్టరీ ధ్వనులకు కారణమేంటనేది అంతు చిక్కడం లేదు.

Published : 02 Jun 2023 15:56 IST

కొట్టాయం: కేరళ (Kerala)లోని ఓ చిన్న గ్రామంలో భూమి నుంచి భారీ శబ్దాలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇలాంటి వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం.. ఈ మిస్టరీ శబ్దాలకు (Mysterious sounds) కారణాలను తెలుసుకునేందుకు నిపుణులను రంగంలోకి దించుతోంది. అసలేం జరిగిందంటే..

కొట్టాయం (Kottayam) జిల్లాలోని చెన్నపాడి అనే కుగ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున రెండుసార్లు చెవులు పగిలిపోయేలా భారీ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ వారం ఆరంభంలో చెన్నపాడితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఇలాంటి ధ్వనులే వినిపించాయని వారు పేర్కొన్నారు. వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకపోయినా.. శబ్దాలు (Mysterious sounds) వినిపిస్తుండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

దీంతో కేరళ గనులు, భూగర్భ శాఖ అధికారులు దీనిపై స్పందించారు. త్వరలోనే నిపుణుల బృందం ఈ ప్రాంతంలో పర్యటించి పరిశోధనలు చేస్తుందని తెలిపారు. ‘‘కొద్ది రోజుల క్రితం తొలిసారి ఈ శబ్దాలు వినిపించినప్పుడే మేం ఈ ప్రాంతాన్ని పరిశీలించాం. ధ్వనుల ఆనవాళ్లు ఏం లభించలేదు. అయితే, శుక్రవారం కూడా ఇలాగే భారీ శబ్దాలు వచ్చినట్లు మాకు సమాచారం వచ్చింది. త్వరలోనే మా సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్సెస్‌ బృందం అక్కడకు వెళ్తుంది. నిపుణుల అధ్యయనం పూర్తయిన తర్వాతే ఆ ధ్వనులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేదానిపై స్పష్టత వస్తుంది’’ అని అధికారులు వెల్లడించారు.

కాగా.. గతంలో మహారాష్ట్ర (Maharashtra)లోని లాతూర్‌ (Latur) జిల్లా పరిధిలో గల కొన్ని గ్రామాల్లోనూ భూగర్భం నుంచి ఇలాంటి వింత శబ్దాలు వినిపించాయి. అప్పట్లో దానిపై నిపుణులు అధ్యయనం చేసినప్పటికీ.. అవి ఎక్కడి నుంచి వచ్చాయన్నది మాత్రం తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు